సాదారణంగా దీపావళి వేడుకలంటే లక్ష్మి పూజ నిర్వహించడం అందరికితెలుసు..!
కాని వాటితో పాటు నరక చతుర్దశి సందర్బంగా కోలా తిప్పుకోవడం, ఆసందర్బంగా పాడే పాటలు ఈ జనరేషన్ పూర్తిగా మర్చి పోయారు, కాని ఇప్పకటికొన్ని ప్రాంతాల్లో ఈ కోలా తిప్పుకోవడం ఉంది... ఆలాగే అభ్యంగన స్నానంకుముందు ఇంటి ఆడపడుచులు సోదరులతో పటు ఇంటిల్లిపాదికి గట్టిపిందిపిడిచాలతో నివాళి ఇవ్వడం... లాంటి అపురూప ఘట్టాలు పొందు పరిచినక్లిప్పింగ్ అందిస్తున్నాం చుడండి... కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా...
"కోల ర కోల జ్యోతి ర జ్యోతి" అని పాడుతూ ఈ కోల మన చుట్టురా తిప్పుకుంటే అన్ని రకాల పీడలు తొలిగి పోతాయి ....
దీపావళి కి వారం రోజుల ముందు నుండి ప్రతి రోజు రాత్రి తిప్పుకుంటారు ( నవమి నుండి నరక చతుర్దశి వరకు) ...ఈ కోల తయారు చేయాలoటే ఎంతో ఓపిక మరియు శ్రద్ద కావాలి , దీన్ని తయారు చేయడానికి గొడ్డలి,బాడిసె ,కొడవలి అవసరం ....అలాగే దీని తయారికి తుమ్మ చెట్టు బొండ , దుస్సేరు తీగ , సన్నని చెక్క పేళ్ళు అవసరం .....ప్రస్తుతం నా చెతిలో కనిపిస్తున్న ఈ కోల స్వయంగా నేను తయారు చేసిందే ...కోల తయారు చేయడం నేను మా నాన్నగారి నుంచి నేర్చుకున్నాను .....ఇలా తయారు చేయడం తిప్పుకొవడం ఒక గొప్ప అనుభూతి ,త్రుప్తి మరియు ఆననందం ......మా చిన్నతనములో ప్రతివొక్కరు శ్రద్దగా ఈ ఆచారాన్ని పాటించారు కాని ఈ మధ్య కాలంలో చాల వరకు తగ్గిపొయింది .
కొలరే కోలా ...
0 comments:
Post a Comment