WELCOME TO DEAR MANTHANITES,PLS JOIN THIS WEB SITE:మన మంథని information resource centre for entertainment (వినోదం), custom (సంప్రదాయ), cultural (సంస్కృతి), literary (సాహిత్య) and devotional (భక్తి) aspects of all Telugu people. Here you will find some information and devotional Songs. Also included is a separate Bhakti page with collection of all familiar stotras, slokas, pujas and vratas in audio and lyrics format..

శ్రీ కార్తీక స్నాన సంకల్పః


కార్తీక మాసం ప్రతి రోజు ఉదయమే కార్తీక స్నానము ఎందుకు చేయాలి ? శ్రీ కార్తీక స్నాన సంకల్ప ఎందుకు చెప్పుకోలి ?‚కార్తీక దీపాలు ....ఈ దీపారాధన అనేది ప్రధానాంశం.....ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగునునింపుతాయి...ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది.. ఈ ఫై వివరములు అన్నియు ..Mana Manthani..... Web Site Lo Bhakti Page లో పొందుపరచడం జరిగింది .....Pls Visit..
శ్రీ కార్తీక స్నాన సంకల్పః
ప్రార్థనం :
"నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే //" (అనుకుంటూ ఆచమనం చేసి)
సంకల్పం :
దేశకాలౌ సంకీర్త్య - గంగావాలుకాభి సప్తర్షిమంఢల పర్యంతం కృతవారాశేః పాండరీ కాశ్వమేధాది సమస్తక్రతు ఫలావా ప్త్యర్థం, ఇహ జన్మని జన్మాంతరేచ బాల్య కౌమార యౌవన వార్థకేషు జాగ్రత్ వప్న సుషుప్త్యవస్థాషు జ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః, స్వతః ప్రేరణయా సంభావితానాం సర్వేషాం పాపానా మపనోదనార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్ధ సిద్ద్యర్ధం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ద్యర్థం వర్షేవర్షే ప్రయుక్త కార్తీకమాసే..............వాసర(ఏ వారమే ఆ వారం పేరు చెప్పుకోవాలి) యుక్తాయాం............తిథౌ (ఏతిథో ఆ తిథి చెప్పుకోవాలి) శ్రీ.........(గోత్రనామం చెప్పుకొని) గోఈత్రాభి జాతం................(పేరు చెప్పుకొని) నామధేయోహం - పవిత్ర కార్తీక ప్రాతఃస్నానం కరిష్యే // (అని , స్నానం చేయాలి.) అనంతరం -
మంత్రం :
"తులారాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ,
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా"
అనే మంత్రంతో - ప్రవాహానికి ఎదురుగాను, వాలుగాను, తీరానికి పరాఙ్ముఖంగాను స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆలోఢనం చేసి, 3 దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి, తీరంచేరి, కట్టుబట్టల కొనలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణ మంటారు. అనంతరం మ(పొ)డి వస్త్రాలనూ, నామాలనూ దరించి, ఎవరెవరి కులాచారాల రీత్యా వారువారు సంధ్యావందన గాయత్ర్యాదులను నెరవేర్చుకొని నదీతీరంలోగానీ, ఆలయానికి గాని వెళ్ళి - శివుణ్ణో, విష్ణువునో అర్చించి, ఆవునేతితో దీపారాధనం చేసి, అనంతరం స్త్రీలు తులసి మొక్కనూ, దీపాన్ని - పురుషులు కాయలున్న ఉసిరికొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణాయుతంగా దానం చేయాలి.
దానము చేయువారు చెప్పవలసిన మంత్రము :
ఓం ఇదం ఏతత్ అముకం (ఓమితి చిత్త రోధనాత్ - ఇద మేతత్ ధారయిత్వా ఏతదితి దృష్టయామాస అముకమితి వస్తునిర్దేశన - మితి (స్మార్తం) అద్య................రీత్యా (రీతినా) (అద్యయితి దెశకాలమానవృత్యాది సంకల్పం - రీత్యేతి ఉద్దేశ్యయత్) విసర్జయేత్ (అని - ప్రాచ్యం) దదామి (అని నవీనం) ఎవరికి తోచిన శబ్దం వారు చెప్పుకొనవచ్చును. దానము తీసుకొనువారు చెప్పవలసిన మంత్రం :
(దానం చేసేటప్పుడు ఆ దానాన్ని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి.) 
ఓం............ఏతత్..................ఇదం.
(ఓమితి చిత్తనిరోధనస్యాత్ - ఏతదితి కర్మణ్యే - ఇదమితి కృతమిర్థాత్) అముకం - (స్వకీయ ప్రవర చెప్పుకొనవలెను)
అద్యరీత్యా - దేశకాలమాన పరిస్థితిరీత్యా సంకల్పం చెప్పుకొని - దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దష్పల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని - ఇదం అముకం దానంగృహ్ణామి.........) (ఇదమితి దృష్ట్య్వాన, అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః) అని చెప్పుకొనుచూ "పరిగృహ్ణామి" లేదా "సీగృహ్ణామి" అని అనుచూ స్వీకరించాలి.
శ్రీ శివస్తోత్రం :
శ్లో. వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంకవహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజ నాశ్రయంచ వరదం వందే శివం శంకరం .
శ్రీ విష్ణు స్తోత్రం :
శ్లో . శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. 

0 comments:

Post a Comment

 
Design by Mana Manthani Themes | Bloggerized by avadhanula prasad - Mana Manthani | manthani