WELCOME TO DEAR MANTHANITES,PLS JOIN THIS WEB SITE:మన మంథని information resource centre for entertainment (వినోదం), custom (సంప్రదాయ), cultural (సంస్కృతి), literary (సాహిత్య) and devotional (భక్తి) aspects of all Telugu people. Here you will find some information and devotional Songs. Also included is a separate Bhakti page with collection of all familiar stotras, slokas, pujas and vratas in audio and lyrics format..

కార్తీక మాసం విశిస్టత ,

కార్తీకమాస కర్తవ్య వివిధ ధర్మాలు


కార్తీకమాసమందు ఎవరు పద్మములచేత పద్మముల వంటి నేత్రములు గల హరిని పూజించునో వాని ఇంటిలో పద్మములన్డుండు లక్ష్మీదేవి నిత్యనివాసము చేయును. కార్తీక మాసమందు  భక్తితో తులసీదళముతోను, జాజి పువ్వులతోను హరిని పూజిస్తే మోక్షం ప్రాప్తించును.  కార్తీకమాసమందు మారేడు దళములతో సర్వవ్వాక్కుడయిన హరిని పూజించినవాడు  తిరిగి భూమియందు జన్మించడు.  కార్తీకమాసమందు  భక్తితో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయము కాగానే చీకట్లు ఎలా నశించునో అలా నశించును.ఉసిరి  కాయలతో  ఉసిరిగా  చెట్టు  కింద  హరిని పుజించువానిని  యముడు చూచుటకు  కూడా  సమర్ధుడు  కాడు . కార్తీక మాసమందు  బ్రాహ్మణులతో  కూడా వనభోజనము ఆచరించు వారి యొక్క కోటానుకోట్ల  పాపాలు నశించును .
                 
కార్తీకమాసమందు భక్తిచే  హరియొక్క  ఆలయమందు  మామిడిచిగురాలతో  తోరనమును  గట్టువాడు  పరమపదము  పొందును . కార్తీకమాసమందు హరికి  అరటి   స్తంభాములతోగాని , పుష్పములతో  గాని  మంటపమును  నిర్మించి  పుజించువాడు చిరకాలము  వైకుంటం నందు ఉండును.
కార్తీక మాసం విశిస్టత , Kartika Maasam importence

పుజించు..

శివ దేవునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు.

విశిష్టత
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కృత్తికా నక్షత్రం:కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధి పతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రం తోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమార స్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.

కార్తీక దీపాలు:ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమా నంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ కన్ను లపండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌ భాగ్యాలు కలు గుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.

కార్తీక సోమవారాలు:
ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసం లోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభకు ్తలు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తమున నదీ స్నానమాచరించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతి స్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివప్రీతి కరమైన సోమవారమున భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొ దటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారా శి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలు కొనిగాని వ్రతారంభము ను చేయవలెను. అట్లు ప్రారంభించు సమయంలో ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ చేయుము అనిపిమ్మట స్నానముచేయవలెను.

ఆ విధముగ జీవనదికి బోయి గంగకును, శ్రీ మన్నారాయణునకును, భైరవు నకు ను నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొ దట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి, మార్జన మంత్రముతోడను, అఘమ ర్షణ మంత్రముతోడను, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా చరింపవలెను. పిదప సూర్యున కర్ఘ్య ప్రదానమొసంగి దేవతలకును, ఋషూలకు ను, పితృదేవతలకును క్రమ ప్రకారముగ తర్పణంబు లొనర్పవలెను. అప్పుడది సుస్నామగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము జేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయవలెను.

కార్తీకమాసంబున గంగా గోదావరి కావేరీ తుంగభద్రాదిన దులందు స్నానమొనర్చిన నత్యుత్తమము, గంగానది కార్తీకమాసమునందు నదుల న్నిటియందు ద్రవరూప సన్నిహితయై యుండును. శ్రీ ఆదినారాయణుండు గోష్పా ద మాత్ర ప్రదేశమందున్న జలము నందు సన్నిహితుడై ఉండునని వేదములు, శ్రుతీసృ్మతులు చెప్పుచున్నవి కావున సముద్రకామియగు నదీ స్నానము మిగుల పవిత్రమైనది. నదీ స్నానావకాశము లభింపనిచో! కులువయందుగాని, చెరువునం దుగాని, కూపము కడగాని సూర్యోదయము స్నానము చేయవలెను. పిదప మడిబ ట్టలను ధరించి ముందుగ భగవంతుని స్మరింపవలెను. తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరింపవలెను. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరం సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞము ను ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకుని దేవతార్చనమును చేయవలె ను. స్నానతీర్థమునందే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి.

సూర్యుడస్తమించు కాలమున సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణ్వాలయమున గాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను బూజించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతోగూడిన నైవేద్యము నిడవలయును. ఈ రీతిగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్త వ్రతము చేసినచో కార్తీక మాస వ్రతము పూర్తగును. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి గావించవలెను. కార్తీక మాసమున సోమవారమున శివప్రీతికై సోమవారవ్రతము నొనర్చినవారికి కైలాసమున శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తించును. సోమ వా రవ్రత విధానమెట్టిదన - సోమవారమున నదీ స్నాన మొనర్చి సంపూర్ణముగ నుపవ సించి శివునకభిషేకమొనర్చి రాత్రి మొదటి యామమున భుజింపవలెను.

ఆ దినమున నితరుల వలననే పదార్థమును గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపము లన్నియు నశించును. ఇంకనునత్యంత నిష్ఠతోను, భక్తితోను నాచరింపనవ కాశ మున్నవారు ఆ దినమున రాత్రిగూడ నిద్రింపక పురాణాది పఠనంబువలన జాగరణ మొనర్చి, మరునాడు శక్తి కొలదిగ బ్రాహ్మణులకు సంతర్పణమును చేసి పిదప భుజిం పవలెను. ఈ పై రెండును జేయలేనివారు సోమవారమున నపరాహ్ణము వరకుండి భుజించవలెను.ఇందేది చేయుటకు శక్తిలేనిచో నదీస్నానమును గావించుకుని భగవంతుని ధ్యానించవలెను సోమవారమునస్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శ నమగువరకుపవసించి పిమ్మట భుజించినవారి పాపములు అగ్నిలోబడిన దూదివలె నాశనమగును.ఆ దినమున శివునికభిషేకమొనర్చి బిల్వదళంబులచే సహస్రనామార్చ నము నొనర్చినను, ఇతరులచే చేయించినను, శివపంచాక్షరీ మంత్రమును జపించి నను, వారిని శివుడనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభంబులను చేకూర్చును.

0 comments:

Post a Comment

 
Design by Mana Manthani Themes | Bloggerized by avadhanula prasad - Mana Manthani | manthani