|
ఎప్పుడూ కలాలతో కుస్తీపట్టే మీడియా మిత్రులు మైదానంలో బ్యాట్లు పట్టేందుకు సిద్ధమయ్యారు. నమస్తే తెలంగాణ కప్ మీడియా క్రికెట్ లీగ్ సమరంలో జర్నలిస్టులు పోటీపడనున్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (క్యాట్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మీడియా క్రికెట్ లీగ్ ఈనెల 27న ఆరంభం కానుంది. వచ్చేనెల 6 వరకు జరిగే ఈ ట్వంటీ-20 ఈవెంట్‌కు నమస్తే తెలంగాణ దినపవూతిక టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. రూ. 3 లక్షల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో మొత్తం 18 జట్లు పోటీపడుతున్నాయి.
టోర్నమెంట్ డ్రా కార్యక్షికమం సోమవారం ఇక్కడ ఘనంగా జరిగింది. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్షికమానికి నమస్తే తెలంగాణ సీఎండీ లక్ష్మీరాజం దంపతులు, క్యాట్ అధ్యక్షుడు, నిజామాబాద్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణలు ముఖ్య అతిధులుగా హాజరై జట్ల కెప్టెన్లకు జెర్సీలను అందజేశారు. రౌండ్ రాబిన్ లీగ్ దశగా జరిగే ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ సీవీఆర్ గ్రౌండ్స్(నాగోల్)లో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 18 జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మూడు జట్లు పోటీపడనున్నాయి. ఆయా గ్రూపుల్లో అత్యు త్తమంగా నిలిచిన జట్లు సూపర్ సిక్స్‌లో తలపడతాయి. ఈ దశనుంచి టాప్ 2 జట్లు ఫైనల్‌కు వెళతాయి.
|
0 comments:
Post a Comment