WELCOME TO DEAR MANTHANITES,PLS JOIN THIS WEB SITE:మన మంథని information resource centre for entertainment (వినోదం), custom (సంప్రదాయ), cultural (సంస్కృతి), literary (సాహిత్య) and devotional (భక్తి) aspects of all Telugu people. Here you will find some information and devotional Songs. Also included is a separate Bhakti page with collection of all familiar stotras, slokas, pujas and vratas in audio and lyrics format..

Sri Vara Laxmi vratham @ cl Rajam Gari Recd...

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారికి ఆమె ప్రతి యేడు జరిపే విశేషాలంకారణ అందరికీ ఆత్మానందాన్ని కలిగిస్తుంది. ఈ ఏడాది అమ్మవారిని ‘శ్రీ రాజరాజేశ్వరీ’గా పూజా గది మంటపంలో ఆమె స్వయంగా అలంకరించారు. మూలాధారపు ఆకృతిలో అలంకారం మొదలై, గణపతి, కుమారస్వామి, అన్నపూర్ణ, లక్ష్మీనారాయణులు, త్రిమూర్తులు అందరిపై పరిపూరక చక్రంలో స్వయంభూగా, సర్వకామదాయినీయై రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారిని అలంకరించారు. షోడశోపచారాలతో అమ్మవారిని ఆవాహనం చేసి, పూజించిన తీరు అత్యంత శోభాయమానం. హైదరబాద్‌లోని జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 49లోని వారి నివాసంలో ఒక పెద్ద పండుగ. పెద్దమ్మగుడికి సమీపంలో ఉన్న ఆ ఇంటిలోకి సాక్షాత్తు అమ్మవారే నడిచి వచ్చారా అన్నంతగా అక్కడి వాతావరణాన్ని తీర్చిదిద్దారు. ఆద్యంతం భక్తి ప్రపత్తులతో, అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆ ఇంటి వాతావరణం కోలాహలంగా మారింది. అమ్మవారి కోసం అద్భుతంగా అల్లిన సువాసనా భరిత పూలమాలలతో అలంకరించారు.


అన్నీ ఉన్నా సశాస్త్రోక్తంగా చేయాలన్న సంకల్పం ఉండడం, దాన్ని ఆచరణలో చూపించడం అందరికీ సాధ్యం కాదన్నది సత్యం. వ్రతాన్నీ ఇంతలా చేయవచ్చా అన్నరీతిలో చేసి చూపించడం కేవలం విజయలక్ష్మీరాజంకే సాధ్యమనడంలో అతిశయోక్తికాదేమో! మూలాధారణ చక్రం, పూజా మంటపానికి, పరిసరాల అలంకరణల కోసం ఒక రోజు ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచారు. శుక్రవారం బ్రహ్మీముహూర్తం నుంచే పూజాదికాలకు సర్వం సిద్ధం చేసుకొని తెల్లవారే సరికి పూజలు ప్రారంభించారు. మధ్యాహ్నానికి వరలక్ష్మీ వ్రతం నోచుకోవడం పూర్తిజేశారు. సాయంత్రం నుంచి వచ్చిపోయే అతిథులకు, ముత్తయిదువులకు వాయినాలు, ఇచ్చారు. మొత్తం సుమారు 2000 మంది హాజరైనట్లు అంచనా. వారిలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.

పదిహేడేళ్లుగా తనదైన శైలిలో భక్తిక్షిశద్ధలతో ‘వరలక్ష్మీ వ్రతాన్ని’ నోచుకొన్నారు. వ్రతం కోసం వారింట చేసిన అలంకరణ చూసిన వారందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. శ్రీ లలితా సహవూసనామాల్లోని ఒక శ్లోకాన్ని అర్థపరమార్థాన్ని మేళవింపజేస్తూ ఆమె తన పూజా గదిని అలంకరించారు. రెండుమూడు నెలల ముందే విజయ లక్ష్మీరాజం అమ్మవారి అలంకరణపై కసరత్తు చేశారు. ఎంచుకొన్న శ్లోకానికి తాత్పర్యాన్ని సందర్భోచితంగా మలుచుకొన్నారు. దానికి విశిష్టమైన తన వ్యాఖ్యానాన్ని జోడించి ఆ మేరకు ఒక రచన చేశారు. దీన్నంతా కలిపి ఒక ధార్మిక పుస్తకంగా ఆమె ముద్రించారు. అమ్మవారి ధర్మ సందేశంతో కూడిన ఈ పుస్తకాన్ని వ్రతం పూర్తయిన తర్వాత ముత్తయిదువలకు సుమంగళ ద్రవ్యాలతో పాటు బహుకరించారు. 


‘సుఖారాజ్య శుభకరీ శోభనా సులభాగతిః
రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా!’ 

దీనికి తెలుగులో అర్థవంతమైన వివరణతో కూడిన పుస్తకాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా విజయ లక్ష్మీరాజం మాట్లాడుతూ..‘ప్రతి ఒక్కరికీ నాలుగు వాసనలు అవసరమన్నారు. అవి ఒకటి సత్కర్మలు చేయడం, రెండోది పుణ్యకార్యాలు, ధర్మకార్యక్షికమాలు చేయడం, పాల్గొనడం. మూడోది అన్నార్తులను, దుఃఖార్తులను ఆదుకోవడం. నాల్గోది ఇతరులను నిందించడం, తప్పుచేసిన వారిని శిక్షించడంలో ఉపేక్షించడం(తాత్సర్యం) చేయడం అవసరమ’ని ఆమె అన్నారు. నేటి సమాజంలో మానవుడు నిస్వార్థంగా తన పని తాను చేసుకొంటూ పోతే చాలు అమ్మ అనుక్షిగహం కలుగుతుందని చెప్పారు. వేదాలు, ఇతిహాస, పురాణాలలో చెప్పిన ధర్మసూక్ష్మాలను ఆచరిస్తే చాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండవచ్చన్నారు. 


నిష్కపటంగా అమ్మను ఆరాధిస్తే కుల, మత, లింగ, జాతి భేదాలు లేకుండా అమ్మ అనుక్షిగహిస్తుందని, దానికి ఉదాహరణ సామాన్య స్త్రీ అయిన లోపామువూదార్చిత అమ్మ సేవతో అమ్మ సహవూసనామాల్లో ఒకటిగా మారి, జన్మసార్థకత చేసుకొందని, సమాజంలో అందరూ మానవత్వంతో భక్తిభావంతో ఉంటే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆమె అన్నారు. 


భక్తి, పూజాదికాలు ఒక విశ్వాసమే కావచ్చు. కానీ అవి మానవుడి శ్రేయస్సుకు ఉపయోగపడుతూ, తోటిమానవులకు సహాయపడుతుంటే వాటిని ఆచరించడంలో తప్పు లేదు. యాంత్రిక జీవనం పట్ల పాశ్చాత్యులు కూడా విసిగిపోతున్న నేపథ్యంలో ప్రాచీన భారతీయ సంప్రదాయాలు మానవాళి మనుగడకు దారి చూపిస్తుండడం గర్వకారణం. ‘గో బ్యాక్ టూ వేదాస్’ అన్న దయానంద సరస్వతి పిలుపును గుర్తుకు తెచ్చేలా విజయలక్ష్మీరాజం వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. సర్వేజనా సుఖినోభవంతు....

0 comments:

Post a Comment

 
Design by Mana Manthani Themes | Bloggerized by avadhanula prasad - Mana Manthani | manthani